సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Aug 31, 2020 , 02:37:24

ప్రతి ఆదివారం డ్రైడే పాటిద్దాం

ప్రతి ఆదివారం డ్రైడే పాటిద్దాం

  •  ‘10 గంటల 10 నిమిషాలు’లో మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట కలెక్టరేట్‌/పర్వతగిరి:  ‘కరోనా విపత్కర పరిస్థితుల్లో సీజనల్‌ వ్యాధులు ప్రబళకుండా ప్రజలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి.. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలపాటు డ్రై డే పాటించాలి’ అని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలోని 20, 21, 23 వార్డుల్లో మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఇంటింటికీ తిరుగుతూ డ్రై డే కార్యక్రమంపై అవగాహన కల్పించారు. వార్డుల్లో తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరిలోని తన ఇంట్లో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పారిశుద్ధ్య పనులు చేశారు. కేటీఆర్‌ ఇచ్చిన స్వచ్ఛ పిలుపును ప్రజలంతా పాటించాలని ఎర్రబెల్లి కోరారు. 


logo