పీవీ వ్యక్తి కాదు ఒక శక్తి

హైదరాబాద్ : భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 16వ వర్ధంతి సందర్భంగా నెక్లెస్‌రోడ్డులోని పీవీ జ్ఞానభూమి వద్ద శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు కే కేశవరావు నివాళులర్పించారు.
పీవీ వ్యక్తి కాదు ఒక శక్తి, దేశానికి దిక్సూచి. అందరికీ ఆదర్శప్రాయుడు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పీవీ పేరు ప్రఖ్యాతులు పొందారు. - స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
దేశంలో ఎన్నో సంస్కరణలు తెచ్చిన గొప్ప మహనీయుడు పీవీ. శతజయంతి ఉత్సవాలను జరుపుకోవడం ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి. - మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
పీవీ నరసింహారావు చేసిన సంస్కరణలు, ఆలోచనలు తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. పీవీకి భారతరత్న ఇవ్వాలని తెలంగాణ ప్రజానీకంతో పాటు ఎన్ఆర్ఐలు కోరుతున్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం. పీవీ పేరుతో స్టాంప్‌ను విడుదల చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాం. - రాజ్యసభ సభ్యులు కే కేశవరావు
ఇవి కూడా చదవండి..
పీవీ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్సీ కవిత నివాళి
తాజావార్తలు
- మాస్క్.. మట్టిలో కలిసేందుకు 50 ఏండ్లు
- ఎస్వీబీసీకి రూ.1.11 కోట్ల విరాళం
- రేపు అంగన్వాడీ సిబ్బందికి చీరెలు పంపిణీ
- జూబ్లీహిల్స్‌లో గ్యాంగ్‌వార్ కలకలం
- రామ్ చరణ్ ఖాతాలో మరో ఇద్దరు దర్శకులు.. నెక్ట్స్ ఏంటి..?
- బెంగాల్ బరిలో శివసేన.. 100 స్థానాల్లో పోటీ?!
- మమతా బెనర్జీ ఇస్లామిక్ ఉగ్రవాది: యూపీ మంత్రి
- బస్సును ఢీకొన్న లారీ.. 8 మందికి గాయాలు
- లారీని ఢీకొట్టిన బైక్ : యువకుడు దుర్మరణం.. యువతికి తీవ్రగాయాలు
- లోన్ ఫ్రాడ్ కేసు: అహ్మదాబాద్‌లో హైదరాబాదీ అరెస్ట్