ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 21, 2020 , 01:45:34

గుమ్మడిదల ఎత్తిపోతలు నిర్మించండి

గుమ్మడిదల ఎత్తిపోతలు నిర్మించండి

  • సీఎం కేసీఆర్‌కు టీఆర్‌ఎస్‌ నేత మర్రి రాజశేఖర్‌రెడ్డి విజ్ఞప్తి

మేడ్చల్‌, నమస్తే తెలంగాణ: కొండపోచమ్మ రిజర్వాయర్‌ నుంచి సంగారెడ్డి కాల్వపై గుమ్మడిదల ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు మర్రి రాజశేఖర్‌రెడ్డి అభ్యర్థించారు. ఈ ప్రాజెక్టుతో మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో కొత్తగా 25 వేల ఎకరాలు సాగులోకి వస్తాయని, తాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుందని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల కలిగే ప్రయోజనాలపై సీఎం కేసీఆర్‌కు ఇటీవల ఓ నివేదికను అందజేశారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారుల సూచన మేరకు రాష్ట్ర ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సీ మురళీధర్‌ను కలిసి ప్రాజెక్టు ప్రయోజనాలను వివరించారు. ప్రాజెక్టుతో 8 మండలాల (మనోహరాబాద్‌, ములుగు, మేడ్చల్‌, శివ్వంపేట, హత్నూర, జిన్నారం, అమీనాపూర్‌, గుమ్మడిదల) పరిధిలోని 50 గ్రామాలకు తాగు, సాగునీరు, 164 చెరువులను కాళేశ్వరం జలాలతో నింపవచ్చని రాజశేఖర్‌రెడ్డి చెప్పారు. మేడ్చల్‌, నర్సాపూర్‌, గజ్వేల్‌ పట్టణాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు రూ.322 కోట్ల వరకు ఖర్చవుతుందని ఆయన తెలిపారు. 


logo