మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 29, 2020 , 02:15:36

గుమ్మడిదల ప్రాజెక్టుకు తొలిఅడుగు

గుమ్మడిదల ప్రాజెక్టుకు తొలిఅడుగు

  • సాధ్యాసాధ్యాలపై ఇరిగేషన్‌ అధికారుల సర్వే
  • ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీఆర్‌ఎస్‌ నేత మర్రి రాజశేఖర్‌రెడ్డి కృతజ్ఞతలు

మేడ్చల్‌, నమస్తే తెలంగాణ: గుమ్మడిదల ప్రాజెక్టు నిర్మాణానికి తొలి అడుగు పడింది. ప్రాజెక్టు నిర్మించనున్న ప్రాంతాల్లోని భూములను సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ అధికారులతో కలిసి టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ ప్రాజెక్టు పూర్తిచేయడం ద్వారా మేడ్చల్‌, సంగారెడ్డి, నర్సాపూర్‌తోపాటు రంగారెడ్డి జిల్లాలోని సుమారు 162 చెరువులను నింపుకొని, దాదాపు 25 వేల ఎకరాలను కొత్తగా సాగులోకి తేవచ్చు. సీఎం ఆదేశాలతో ఇరిగేషన్‌ ఉన్నతాధికారులు సర్వే అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో కలిసి భూములను పరిశీలించారు. 

నర్సాపూర్‌, లక్ష్మీపూర్‌ మధ్య సముద్రమట్టానికి 650 మీటర్ల ఎత్తులో డెలివరీ సిస్టర్న్‌ నిర్మించవచ్చని, దీనివల్ల ఎక్కువ నీరు గ్రావిటీ ద్వారానే వెళ్తుందని ఇంజినీరింగ్‌ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి సర్వే ప్రారంభించిన సీఎం కేసీఆర్‌కు మర్రి రాజశేఖర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. విన్నవించగానే అధికారులకు ఆదేశాలివ్వడంతోపా టు అధికారుల బృందం సర్వే చేపట్టడంపై హర్షం వ్యక్తంచేశారు. అధికారుల బృందంలో సంగారెడ్డి ఇరిగేషన్‌ డీఈ శ్రీనివాస్‌, కన్సల్టెన్సీ ప్రతినిధి మధుసూదన్‌ ఉన్నారు.logo