శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Oct 12, 2020 , 12:12:46

ప్ర‌తి ఒక్క‌రికి హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు : క‌విత‌

ప్ర‌తి ఒక్క‌రికి హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు : క‌విత‌

నిజామాబాద్ : ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి క‌ల్వ‌కుంట్ల క‌విత ఘ‌న విజ‌యం సాధించారు. ఈ సంద‌ర్భంగా క‌విత మీడియాతో మాట్లాడుతూ.. ఈ స్థానిక సంస్థ‌ల ఉప ఎన్నిక‌ల్లో త‌న‌కు స‌హ‌క‌రించి, గెలిపించిన ప్ర‌తి ఒక్క‌రికి హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఎంపీటీసీలు, జ‌డ్పీటీసీలు, కౌన్సిల‌ర్లు, కార్పొరేట‌ర్లు, చైర్మ‌న్ల‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల‌కు క‌విత ధ‌న్య‌వాదాలు చెప్పారు. 

మొత్తం 823 ఓట్లలో క‌విత‌కు 728 ఓట్లు వ‌చ్చాయి. బీజేపీ అభ్య‌ర్థికి 56 ఓట్లు, కాంగ్రెస్‌కు 29 ఓట్లు వ‌చ్చాయి. మొత్తం ప‌ది ఓట్లు చెల్లుబాటు కాలేదు. 

ఉద‌యం 8 గంట‌ల‌కు ఓట్ల లెక్కింపు ప్రారంభ‌మైంది. మొద‌టి రౌండ్‌లో 600 ఓట్ల‌కుగాను టీఆర్ఎస్‌కు 542 ఓట్లు వ‌చ్చాయి. బీజేపీకి 39, కాంగ్రెస్ 22 ఓట్లు పోల‌య్యాయి. 8 ఓట్లు చెల్ల‌కుండా పోయాయి. రెండో రౌండ్‌లో 221 ఓట్ల‌కుగాను టీఆర్ఎస్‌కు 197, బీజేపీకి 17, కాంగ్రెస్‌పార్టీకి 7 ఓట్లు వ‌చ్చాయి. రెండు ఓట్లు చెల్లుబాటుకాలేదు.