శనివారం 06 మార్చి 2021
Telangana - Jan 20, 2021 , 18:56:23

బాధిత కుటుంబానికి టీఆర్‌ఎస్‌ నాయకుడి ఆర్థికసాయం

బాధిత కుటుంబానికి టీఆర్‌ఎస్‌ నాయకుడి ఆర్థికసాయం

భద్రాద్రి కొత్తగూడెం : గతంలోనే భర్తను కోల్పోయి, ఇటీవల కొడుకును కూడా కోల్పోయిన బాధిత మహిళకు స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకుడు ఆర్థికసాయం అందించారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో చోటుచేసుకుంది. పట్టణంలోని ఏఎంసీ కాలనీలో నివాసం ఉండే కే. సాగర్‌(21) అనే యువకుడు జనవరి 7వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. స్నేహితులంతా కలిసి చికిత్స నిమిత్తం రూ. 1.20 లక్షలను జమచేసి అందించారు. కాగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో యువకుడు కొన్ని రోజులక్రితం కన్నుమూశాడు. యువకుడి తల్లి సునీతా గతంలోనే భర్తను కోల్పోయింది. దీంతో ఈమె మానసికస్థితి సైతం సరిగ్గా ఉండదు. 

బాధిత కుటుంబ సమస్య తెలిసిన స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకుడు, మాజీ జడ్పీటీసీ అన్నం సత్యనారాయణ మూర్తి రూ. 20 వేలు ఆర్థికసాయం అందించారు. ఈ సందర్భంగా మూర్తి మాట్లాడుతూ.. సాగర్‌ మంచి వ్యక్తి అన్నారు. బ్రతికున్నప్పుడూ ఇతరులకు సాయం చేసేవాడన్నారు. కుటుంబ నిర్వహణ నిమిత్తం సాగర్‌ తల్లికి తన మద్దతు కొనసాగనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు రాంబాబు, గోపి నాగేందర్‌, పిలక శ్రీరాం, కిశోర్‌, తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo