గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Nov 18, 2020 , 09:55:05

టీఆర్‌ఎస్‌ గ్రేటర్‌ ఎన్నికల ప్రచారం షురూ..

టీఆర్‌ఎస్‌ గ్రేటర్‌ ఎన్నికల ప్రచారం షురూ..

హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారం బుధవారం ప్రారంభమైంది. మంగళవారం ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడడంతో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం నాయకులు కృషి చేస్తున్నారు. ఓల్డ్ బోయినపల్లిలో ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు కలుస్తూ ఓట్లు అభ్యర్థించారు. త్వరలో జరుగనున్న గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికే ఓటు వేసి గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని ప్రభుత్వం హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తుందన్నారు. ఇప్పటికే ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. అలాగే సంక్షేమ పథకాలు అమలు చేస్తూ నిరుపేదలకు అండగా ఉంటుందన్నారు. నగరం మరింత అభివృద్ధి చెందాలంటే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులనే ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.