మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 08, 2020 , 16:29:16

టీఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తి : మంత్రి కొప్పుల

టీఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తి : మంత్రి కొప్పుల

పెద్దపల్లి జిల్లా : ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రతిపక్షాలు తుడిచిపెట్టుకు పోతున్నాయని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు స్వరాష్ట్రాన్ని సాధించి పెట్టి తెలంగాణను అన్ని రంగాల్లో ప్రగతిపథాన నడిపిస్తున్న సీఎం కేసీఆర్ మహోన్నత నాయకుడని కొనియాడారు. జిల్లాలోని ధర్మారం మండలానికి చెందిన పలు గ్రామాల్లోని కాంగ్రెస్, బీజీపీ నాయకులు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయాయన్నారు. సీఎం కేసీఆర్ సుపరిపాలనకు అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ పుట్టా మధుకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, ఉపాధ్యక్షుడు ఎం.తిరుపతి, జెడ్పీటీసీ పి.పద్మజ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుర్రం మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



logo