శనివారం 23 జనవరి 2021
Telangana - Nov 29, 2020 , 18:41:39

చివరిరోజు హోరెత్తిన టీఆర్‌ఎస్‌ ప్రచారం

చివరిరోజు హోరెత్తిన టీఆర్‌ఎస్‌ ప్రచారం

హైదరాబాద్‌ : జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో చివరిరోజు ఆదివారం ఉప్పల్‌ నియోజకవర్గం చిలకా నగర్ డివిజన్‌లో రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ బండా ప్రకాశ్‌తో కలిసి టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీమతి గీతా ప్రవీణ్ ముదిరాజ్ తరఫున విస్తృత ప్రచారం నిర్వహించారు. పార్టీ శ్రేణులతో కలిసి భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఇంటింటికీ తిరిగి ఆరేండ్ల కాలంలో టీఆర్‌ఎస్‌ చేసిన అభివృద్ధిని వివరిస్తూ  కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.

 సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా కొనసాగుతున్నాయని అన్నారు. టీఆర్‌ఎస్‌ అన్నివర్గాలకు రాజకీయ ప్రాధాన్యం కల్పిస్తుందని, ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన బండా ప్రకాష్‌ను రాజ్యసభ  సభ్యుడిగా ఢిల్లీకి పంపిందని గుర్తుచేశారు. చిల్కానగర్ డివిజన్‌లో సమస్యల పరిష్కారానికి మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారని, ఎన్నికలు ముగియగానే ప్రతి సమస్యను ప్రాధాన్య క్రమంలో పరిష్కరిస్తామని తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo