మంగళవారం 26 మే 2020
Telangana - May 12, 2020 , 18:30:41

ఒక్క నీటి బొట్టు తరలించినా ఊరుకోం : విప్‌ కర్నె ప్రభాకర్‌

ఒక్క నీటి బొట్టు తరలించినా ఊరుకోం : విప్‌ కర్నె ప్రభాకర్‌

హైదరాబాద్‌ : పోతిరెడ్డిపాడుపై తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉందని ప్రభుత్వ విప్‌ కర్నె ప్రభాకర్‌ స్పష్టం చేశారు. రాయలసీమ అక్రమంగా ఒక్క నీటి బొట్టు తరలించినా ఊరుకోమని ఆయన హెచ్చరించారు. ఈ నెల 5వ తేదీన ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు నుంచి 80 వేల క్యూసెక్కులను అక్రమంగా తరలించేందుకు జీవో విడుదల చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రభాకర్‌ చెప్పారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ నల్ల జెండాలతో ప్రదర్శనలు జరపాలని పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి నీటి అక్రమ తరలింపుపై బీజేపీ నిఖార్సుగా పోరాడితే చాలు అని కర్నె ప్రభాకర్‌ సూచించారు. 


logo