గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 15, 2020 , 19:08:23

రైతులకు అండగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం : మంత్రి నిరంజన్‌ రెడ్డి

రైతులకు అండగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం : మంత్రి నిరంజన్‌ రెడ్డి

మహబూబ్‌నగర్‌ : రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికే అధిక ప్రాధాన్యత ఇస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. జిల్లాలోని అడ్డాకుల మండలం బలీదుపల్లి గ్రామానికి చెందిన రైతు బోయ కురుమూర్తి మృతి చెందారు. బాధిత కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉండగా ఉంటుందని మనోధైర్యం కల్పించారు. అనంతరం కురుమూర్తి భార్య అలివేలకు రైతుబీమా ద్వారా మంజూరైన రూ.5 లక్షల చెక్కును మంత్రి అందజేశారు. కార్యక్రమంలో విండో చైర్మన్‌ మద్దూరి జితేందర్‌రెడ్డి, పెద్దమందడి టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వేణు, మాజీ ఎంపీపీ దయాకర్‌, సర్పంచ్‌ పద్మనర్సింహ, ఎంపీటీసీ గణేశ్‌, రంగన్నగౌడ్‌, డైరెక్టర్‌ రాజవర్ధన్‌రెడ్డి, ఏఈవో లక్ష్మి, నాయకులు చంద్రమోహన్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, తిరుపతి, వెంకటేశ్‌, మన్యంకొండ, నరేందర్‌, యాదయ్య పాల్గొన్నారు.