శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 28, 2020 , 13:44:09

రైతుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి

రైతుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి

రంగల్ రూరల్: ప్రమాదవశాత్తు పెద్ద దిక్కును కోల్పోయిన రైతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. నర్సంపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రైతుబీమా చెక్కుల పంపిణీ చేశారు. ఎంతోమంది రైతుల కుటుంబాలకు చేయూత నిచ్చి ఆదుకుంటామని భరోసానిచ్చారు. నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి, నల్లబెల్లి, నెక్కొండ, చెన్నరావుపేట మండలాల్లో వేర్వేరు ఘటనల్లో ప్రమాదవశాత్తు మృతి చెందిన 8 మంది రైతుల కుటుంబాలకు (ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున) రూ.40 లక్షల రైతుబీమా చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు త్వరగా అందేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఓడీసీఎం ఎస్ చైర్మన్ రామస్వామి నాయక్, జెడ్పీ వైస్ చైర్మన్ శ్రీనివాస్, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, వ్యవసాయ శాఖ అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.logo