శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 12:54:40

మహిళల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి

మహిళల అభ్యున్నతికి  టీఆర్ఎస్  ప్రభుత్వం కృషి

నల్లగొండ : మహిళాభ్యుదయమే ధ్యేయంగా  రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని నల్లగొండ నియోజక వర్గ శాసన సభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు.  జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే సఖి కేంద్రములో నూతన భవన నిర్మా ణానికి భూమి పూజ చేసి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇబ్బందులలో ఉన్న మహిళల రక్షణ కోసం, వారి సమస్యలకు ఉచితంగా న్యాయ సలహాలు అందిస్తూ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్న సఖి కేంద్ర సేవలను వినియోగించుకోవాలని సూచించారు.  కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, నల్గొండ మున్సిపల్ పల్ ఛైర్మెన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, కౌన్సిలర్ పిల్లి రామరాజు, తదితరులు పాల్గొన్నారు.

 


logo