కారుకే ముదిరాజ్‌ల మద్దతు

- టీఆర్ఎస్కే ఓటేస్తామని తీర్మానాలు
- గులాబీ పార్టీకి అన్ని వర్గాల అండ
సకలజనులు టీఆర్ఎస్ వెంటే నడుస్తున్నారు.. రాష్ర్టాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్న గులాబీ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నారు. కారు గుర్తుకే ఓటేస్తామని తీర్మానాలు చేస్తున్నారు. తాజాగా బుధవారం ముదిరాజ్ సంఘాలు, హెచ్ఎంఎస్ కార్మిక సంఘం, ఇతర సంఘాలు టీఆర్ఎస్కు మద్దతు తెలిపాయి.
హైదరాబాద్, నమస్తే తెలంగాణ/బంజారాహిల్స్: కులవృత్తులను ప్రోత్సహిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటే ఉంటామని ముదిరాజ్‌లు స్పష్టంచేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గులాబీ పార్టీకి మద్దతు ప్రకటించారు. బుధవారం బంజారాహిల్స్‌లో ముదిరాజ్ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో మంత్రులు ఈటల రాజేందర్, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీలు కే కేశవరావు, బండా ప్రకాశ్ ముదిరాజ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. ముదిరాజ్‌లు, గంగపుత్రులు, రజకులు, నాయీబ్రాహ్మణులు, యాదవులు కులవృత్తుల ఆధారంగా జీవిస్తున్నారని, వారికి చేయూతనిచ్చేందుకు అనేక పథకాలు ప్రారంభించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కులవృత్తులను బలోపేతం చేయాలని కంకణం కట్టుకున్నారని, ఆయాకులాలవారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని పేర్కొన్నారు. ముందుగా బంజారాహిల్స్ డివిజన్ ముదిరాజ్ సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు చింతల భాస్కర్, చింతల ప్రకాశ్, జేజోల రాజు, సుజాత, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ వెంటే హెచ్ఎంఎస్
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు హింద్ మజ్దూర్ సభ (హెచ్ఎంఎస్) కార్మిక సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. రైల్వే ఉద్యోగులు, కార్మికులు గులాబీ పార్టీకి అండగా నిలువాలని హెచ్ఎంఎస్, రైల్వే మజ్దూర్ యూనియన్ జాతీయ ఉప కార్యదర్శి, ఐదు రాష్ట్రాల ఇంచార్జి శంకర్రావు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్, రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకుడు యాదవరెడ్డి బుధవారం సికింద్రాబాద్‌లో శంకర్రావుతో భేటీ అయ్యారు. టీఆర్ఎస్కు మద్దతు పలుకడంపై ధన్యవాదాలు తెలియజేశారు.
తాజావార్తలు
- 153 మంది పోలీసులకు గాయాలు.. 15 కేసులు నమోదు
- 18 ఏండ్లు పాకిస్తాన్ జైల్లో భారతీయ మహిళ
- సింగరేణి కార్మికులకు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు
- ఇంటర్ తరగతుల నిర్వహణలో స్వల్ప మార్పులు
- సీ మ్యాట్ దరఖాస్తుల గడువు పొడిగింపు
- ట్రక్కు, జీపు ఢీ.. ఎనిమిది మంది మృతి
- సింగరేణి ఓసీపీ-2లో ‘సాలార్' చిత్రీకరణ
- ఆల్‌టైం హైకి పెట్రోల్, డీజిల్ ధరలు
- రాష్ర్టంలో పెరుగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు
- ముస్లిం మహిళ కోడె మొక్కు