శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 01, 2020 , 20:03:28

డీజీపీ, ఈసీ అద‌న‌పు సీఈవోకు టీఆర్ఎస్ విన‌తిప‌త్రం

డీజీపీ, ఈసీ అద‌న‌పు సీఈవోకు టీఆర్ఎస్ విన‌తిప‌త్రం

హైద‌రాబాద్ : రేపు హైదరాబాద్‌లో బీజేపీ భారీ కుట్రలకు పాల్ప‌డే అవకాశం ఉన్న నేప‌థ్యంలో అల్లర్లు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటూ టీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిధులు డీజీపీ మహేందర్ రెడ్డి, ఈసీ అద‌న‌పు సీఈవో బుద్ధ ప్ర‌కాష్‌ను క‌లిసి వినతిపత్రం అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ బాల్కసుమన్‌, ఎమ్మెల్యేలు ఆనంద్‌, కాలేరు వెంకటేష్‌, మాగంటి గోపినాథ్‌, శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు.