కథానాయిక పూర్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం‘బ్యాక్‌డోర్’. కర్రీ బాలాజీ దర్శకత్వంలో బి.శ్రీనివాస రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలోని సెకండ్సాంగ్ను ఇటీవల వాహ్ చెఫ్ సంజయ్ తుమ్మ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘నోరే ఊరేలా.. కూరే కావాలా’ అనే పల్లవితో వున్న పాటను సంజయ్తుమ్మ విడుదల చేయడం సంతోషంగా వుంది. అన్ని రకాల కమర్షియల్ అంశాలతో రూపొందుతున్న ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు కొత్తదనాన్ని పంచుతుంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో బీరం తిరుపతి రెడ్డి, విజయ్.ఎల్.కోట, చిత్ర సమర్పకుడు సెవెన్‌హిల్స్ సతీష్‌కుమార్‌లు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:
ఈ సంతోషం కోసం మూడేళ్లు ఎదురుచూశాం!
తెలుగులో నిహారిక కొణిదెల నటించిన తమిళ చిత్రం
అండర్‌వరల్డ్ గ్రూప్ నేపథ్యంలో ‘శుక్ర’