నిగనిగలాడే క్యాప్సికమ్ పోషకాల గని. ముఖ్యంగా ఎర్ర క్యాప్సికంలోని 30 రకాల యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ప్రాణాంతక క్రిములతో పోరాడి క్యాన్సర్లు రాకుండా కాపాడుతాయి. వీటిలో అధిక మొత్తంలో ఉండే ‘లైకోపెన్’ ప్రొస్టేట్, ఊపిరితిత్తుల క్యాన్సర్లు దరిచేరకుండా సాయపడుతుంది. ‘విటమిన్-ఎ’ పుష్కలంగా ఉండటం వల్ల కంటిచూపు మెరుగవుతుంది. క్యాప్సికమ్‌లోని ‘విటమిన్-సి’ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలోనూ, శరీరం ఐరన్‌ను గ్రహించేలా తోడ్పడుతుంది. రక్తహీనతతో బాధపడే వారికి ఇది మంచి ఆహారం. దీనిలోని ‘విటమిన్-బి6’ కడుపు ఉబ్బరాన్ని తగ్గించి జీవక్రియలు సక్రమంగా సాగేందుకు సాయపడుతుంది. క్యాప్సికమ్‌లో ‘బీటా కెరోటిన్’, ‘ల్యూటెన్’ వంటి పలు విటమిన్లు ఉంటాయి. క్యాప్సికమ్‌ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, ఆర్థరైటిస్, బ్రాంకైటిస్, ఆస్తమా వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.