మంగళవారం 26 మే 2020
Telangana - May 01, 2020 , 22:08:51

అన్నిదానాల కన్నా రక్తదానం గొప్పది : మాజీ ఎంపీ కవిత

అన్నిదానాల కన్నా రక్తదానం గొప్పది : మాజీ ఎంపీ కవిత

నిజామాబాద్ : అన్నిదానాల కన్నా రక్తదానం గొప్పదని, యువత రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని నిజామాబాద్‌ మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు రక్తదాన శిబిరాలు నిర్వహించాల్సిందిగా టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో మాజీ ఎంపీ కవిత రక్తదానం చేశారు. రక్తదానం అత్యవసర పరిస్థితుల్లో మనుషుల ప్రాణాలు కాపాడుతుందని, తలసేమియా, ఇతర అత్యవసర చికిత్సలకు సాయం అందించడానికి రక్తదానం చేసినట్లు తెలిపారు. సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు.. వీలైనంత ఎక్కువగా రక్తదాన కార్యక్రమాలు నిర్వహించాని ఆమె పిలుపునిచ్చారు. 


logo