శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 14, 2020 , 01:20:36

ఘనంగా మాజీ ఎంపీ కవిత జన్మదిన వేడుకలు

ఘనంగా మాజీ ఎంపీ కవిత జన్మదిన వేడుకలు

సికింద్రాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత నిర్వహించిన పాత్ర చిరస్మరణీయంగా నిలుస్తుందని డిప్యూ టీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌ అన్నారు. ఉద్యమ నాయకురాలు కవిత జన్మదిన వేడుకలను డిప్యూటీ స్పీకర్‌  ఆధ్వర్యంలో అసెంబ్లీలోని ఆయన చాంబర్‌లో ఘనంగా జరిపారు. కేక్‌ ను కచ్‌చేసి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా పద్మారావు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతిని కవిత అంతర్జాతీయస్థాయిలో చాటిచెప్పారని, బతుకమ్మ ప్రత్యేకతను, బో నాల విశిష్టతను అందరూ గుర్తించేలా కృషిచేశారని ప్రశంసించారు. మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ  సంతోష్‌కుమార్‌, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.logo