శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Oct 13, 2020 , 11:34:17

దౌల్తాబాద్‌లో టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారం

దౌల్తాబాద్‌లో టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారం

సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత మంగళవారం దౌల్తాబాద్‌ మండలంలో ప్రచారం నిర్వహించారు. ఆమెకు మద్దతుగా మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, సిద్దిపేట జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. రైతులకు, అన్ని వర్గాలకు ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు. రైతులకు వ్యవసాయానికి ఉచిత కరెంటు, పెట్టుబడి కోసం రైతుబంధు పథకం కింద ఆర్థిక సాయం, రైతుబీమాతో కుటుంబాలకు ధీమానిస్తుందన్నారు. అలాగే అర్హులకు పింఛన్లు అందజేస్తున్నట్లు తెలిపారు. అలాగే నియోజకవర్గానికి దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చేసిన సేవలను గుర్తు చేశారు. ఉప ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో సుజాతను గెలిపించాలని కోరారు. కాగా, వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా నాయకులు గొడుగులు పట్టుకొని ప్రచారం నిర్వహించారు. పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ర్యాలీగా వెళ్తూ ప్రచారం చేపట్టారు.లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo