మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Nov 22, 2020 , 22:58:47

చిల్కానగర్‌లో హోరెత్తిన టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారం

చిల్కానగర్‌లో హోరెత్తిన టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారం

హైదరాబాద్‌ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారీ విజయమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. మంత్రి కేటీఆర్‌తో సహా అందరూ క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను కలుపుకుపోతూ అభ్యర్థుల తరఫున ప్రచారాన్ని ఉధృతం చేశారు.  ఆదివారం రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో ఉప్పల్ నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు విస్తృత ప్రచారం నిర్వహించారు.

చిల్కానగర్ డివిజన్ టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులంతా నామినేషన్లు ఉపసంహరించుకొని పార్టీ అభ్యర్థి గీతా ప్రవీణ్ ముదిరాజ్ విజయమే లక్ష్యంగా ప్రచారానికి సిద్ధమయ్యారు.మంత్రి సత్యవతి రాథోడ్ రెబల్స్‌ను బుజ్జగించి వారందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చారు. దీంతో పార్టీ శ్రేణులు, కార్యకర్తల్లో ఉత్సాహం మరింత పెరిగింది. దీంతో చిలక నగర్ డివిజన్లో గులాబీ పార్టీ ప్రచారం ఉత్సాహంగా  కొనసాగుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.