ఎంఐఎంతోనే మాకు పోటీ : మంత్రి జగదీశ్‌రెడ్డి

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎంతోనే టీఆర్ఎస్కు ప్రధాన పోటీ ఉంటుందని మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లను తాము లెక్కలోకే తీసుకోవడం లేదని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ, మజ్లీస్ ఒకదానితో ఒకటి చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నాయని ఆక్షేపించారు. తెర చాటు చీకటి ఒప్పందాలను నగర ప్రజలు గుర్తించారని, వీటిని నగర ప్రజలు గుర్తించి టీఆర్ఎస్ను గెలిపించేందుకు సిద్ధమయ్యారని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన ఎల్బీనగర్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయా చోట్ల ఆయన మాట్లాడుతూ.. బల్దియాపై టీఆర్ఎస్ జెండా ఎగురడం ఖాయమన్నారు. బల్దియా చరిత్రలో తొలిసారి రూ.65 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలోనే హైదరాబాద్ సురక్షితంగా ఉందని.. నగరంలో శాంతిభద్రత పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం పటిష్ఠచర్యలు తీసుకుందని గుర్తుచేశారు. నగరంలో తాగునీటి కొరత తీరింది కేసీఆర్ పాలనలోనే అని కొనియాడారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా వస్తున్నాయని చెప్రారు. ఆయన వెంట రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, నల్లగొండ జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, మాజీ శాసనసభ్యుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, వనస్థలిపురం టీ ఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి జిట్టా రాజశేఖర్ రెడ్డి గడ్డం మల్లేశం పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- కూల్‌డ్రింక్ అని తాగితే.. ప్రాణాలమీదకొచ్చింది
- ఉద్యోగ సంఘాలతో చర్చలకు సీఎం ఆదేశం
- టెస్లా కాన్ఫిడెన్షియల్ డేటా చోరీకి టెక్కీ యత్నం!
- డార్క్ మోడ్ నిజంగా కళ్లని కాపాడుతుందా.. ?
- క్రెడిట్ అంతా సిరాజ్కే దక్కుతుంది: అజింక్య
- మోడల్ స్కూల్, జూనియర్ కాలేజీని సందర్శించిన మంత్రులు
- రోడ్డు ప్రమాదంలో ఏఎస్ఐ డేవిడ్ మృతి
- మందిరాబేడీ 'సన్ డే జబర్దస్త్' వర్కవుట్స్..వీడియో
- మోటార్ ఆన్ చేసేందుకు వెళ్లి రైతు మృతి
- మైనారిటీల మెప్పు కోసం దీదీ తాపత్రయం : బీజేపీ