బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 10, 2020 , 09:02:43

పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల‌లో సోలిపేట సుజాత ముందంజ‌

పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల‌లో సోలిపేట సుజాత ముందంజ‌

సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. మొద‌ట 1453 పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల‌ను లెక్కించారు. ఆ త‌ర్వాత 51 స‌ర్వీస్ ఓట్ల‌ను లెక్కించిన‌ట్లు రిట‌ర్నింగ్ అధికారి తెలిపారు. అయితే పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి సోలిపేట సుజాత అధిక్యంలో ఉన్నారు. పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల‌లో సోలిపేట సుజాత‌కు మెజార్టీ ఓట్లు వ‌చ్చాయి. పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ముగిసిన అనంత‌రం ఈవీఎం ఓట్ల‌ను అధికారులు లెక్కిస్తున్నారు.