బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Oct 16, 2020 , 15:31:36

దుబ్బాక‌ను అభివృద్ధి చేస్తా : ‌సోలిపేట సుజాత‌

దుబ్బాక‌ను అభివృద్ధి చేస్తా : ‌సోలిపేట సుజాత‌

సిద్దిపేట : దివంగ‌త ఎమ్మెల్యే రామ‌లింగారెడ్డి మాదిరిగానే దుబ్బాక‌ను అభివృద్ధి చేస్తాన‌ని టీఆర్ఎస్ అభ్య‌ర్థి సోలిపేట సుజాత రెడ్డి హామీ ఇచ్చారు. దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గంలో ఇవాళ ఆమె ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సోలిపేట సుజాత మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో మీ ముందుకు వ‌చ్చాను.. కారు గుర్తుకు ఓటేసి త‌న‌ను ఆశీర్వ‌దించాల‌ని కోరారు. దుబ్బాక‌ను సీఎం కేసీఆర్ స‌హ‌కారంతో రామ‌లింగారెడ్డి అభివృద్ధి చేశారు. మంత్రి హ‌రీష్‌రావు, ఎంపీ కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి అండ‌దండ‌ల‌తో తాను అభివృద్ధి చేస్తాన‌ని సుజాత రెడ్డి స్ప‌ష్టం చేశారు. 

సీఎం కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యం : ఎంపీ కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి

దుబ్బాక అభివృద్ధి సీఎం కేసీఆర్‌తోనే సాధ్య‌మ‌వుతుంద‌ని ఎంపీ కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ నాయ‌కుల మాట‌లు న‌మ్మి మోస‌పోవ‌ద్దు.. వాళ్లు గెలిచే అవ‌కాశం లేదు. త‌న‌తో పాటు సుజాత ఇక్క‌డే ఉండి అభివృద్ధికి కృషి చేస్తామ‌న్నారు. ఇప్ప‌టికే తాగు, సాగు నీరు అందించామ‌ని తెలిపారు. ఈ ఎన్నిక‌ల్లో కారు గుర్తుకు ఓటేసి సుజాత‌ను భారీ మెజార్టీతో గెలిపించండి అని కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.  

పేద ప్ర‌జ‌ల ఆశాజ్యోతి సీఎం కేసీఆర్ : ఎమ్మెల్యే ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డి

సీఎం కేసీఆర్ పేద ప్ర‌జ‌ల ఆశాజ్యోతి అని మెద‌క్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డి పేర్కొన్నారు. రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు సీఎం కేసీఆర్ ఎన్నో ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెడుతుంటే.. కేంద్రం మాత్రం బావుల వ‌ద్ద మోటార్లు బిగిస్తామ‌ని చెబుతుంది. బీజేపీ నాయ‌కుల‌కు ఓటుతోనే స‌మాధానం చెప్పాల‌న్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతుల సంక్షేమం ఎన్ని ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నారో చెప్పాల‌ని ఆమె డిమాండ్ చేశారు. రైతుల‌ను రాజు చేయాల‌నే సంక‌ల్పంతోనే కేసీఆర్ ముందుకెళ్తున్నార‌ని ప‌ద్మాదేవేంద‌ర్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.


logo