ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 09, 2020 , 21:00:06

టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి భారీ మెజారిటీ ఇవ్వాలి : మంత్రి సత్యవతి రాథోడ్

టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి భారీ మెజారిటీ ఇవ్వాలి : మంత్రి సత్యవతి రాథోడ్

ములుగు : వరంగల్ – ఖమ్మం-నల్గొండ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థికి ములుగు నుంచి భారీ మెజారిటీ వచ్చేలా పార్టీ జిల్లా నాయకులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశుసంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. శుక్రవారం ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించిన పట్టభద్రుల ఓటరు నమోదు సన్నాహక కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు.

పేదలందరికీ సంక్షేమ ఫలాలు  అందిస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని చెప్పారు. గ్రాడ్యుయేట్లందరినీ ఓటర్లుగా నమోదు చేయాలని, 2017 లోపు గ్రాడ్యుయేట్లందరూ ఓటు నమోదు చేసుకోవాలని కోరారు. ఓటరు నమోదులో అభ్యర్థుల వివరాలతోపాటు వ్యక్తిగత ఫోన్ నెంబర్ కచ్చితంగా తీసుకోవాలన్నారు. గ్రామాల్లో సర్పంచులు ఓటరు నమోదు బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో మహబూబాబాద్ ఎంపీ శ్రీమతి మాలోతు కవిత,  జడ్పీటీసీలు హరిబాబు, గోవింద్ నాయక్, భవాని ఎంపీపీలు శ్రీనివాసరెడ్డి, శ్రీదేవి, పలువురు నాయకులు పాల్గొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo