శుక్రవారం 23 అక్టోబర్ 2020
Telangana - Sep 28, 2020 , 02:20:31

కవితకు భారీ మెజార్టీ ఖాయం

కవితకు భారీ మెజార్టీ ఖాయం

  • నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ధీమా
  • మంత్రి వేముల నివాసంలో  అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ:  నిజామాబాద్‌ స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల్లో సమన్వయంతో పనిచేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి కే కవిత భారీమెజార్టీతో విజయం సాధిం చేలా అందరు కృషిచేయాలని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నివాసంలో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు సమావేశమయ్యారు. ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపు నల్లేరు మీద నడకే అయినప్పటికీ భారీ మెజార్టీతో గెలవాలని నేతలంతా నిర్ణయించారు. సమావేశానికి ఎమ్మెల్సీ అభ్యర్థి కవితతోపాటు ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, ఎమ్మెల్యేలు హన్మంత్‌షిండే, బిగాల గణేశ్‌ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్‌, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, సురేందర్‌, డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు సురేందర్‌రెడ్డి హాజరయ్యారు. అక్టోబర్‌ 9న పోలింగ్‌ ఉన్నందున అంతలోపే ఓటర్లందరికీ ఎమ్మెల్సీ ఎన్నిక జరిగే తీరుపై అవగాహన కల్పించాలని నేతలు అభిప్రాయపడ్డారు. ప్రాధాన్యతా క్రమంలో సాగే ఓటింగ్‌పై వివరించాల్సిన అవసరాన్ని నేతలు గుర్తించారు. 

జోరుగా చేరికలు

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ముందే ప్రతిపక్ష పార్టీలకు గట్టి ఎదురు దెబ్బతగులుతున్నది. ఆ పార్టీలకు చెందిన పలు వురు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. నిజామాబాద్‌ 37వ డివిజన్‌కు చెందిన బీజేపీ కార్పొరేటర్‌ కే ఉమారాణి ముత్యాలు, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి కాంగ్రెస్‌ జెడ్పీటీసీ ఉషాగౌడ్‌ ఆదివారం గులాబీ కండువా కప్పుకున్నారు. హైదరాబాద్‌లో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్‌, జీవన్‌రెడ్డి, జాజాల సురేందర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. సీఎం కేసీఆర్‌ జనరంజకపాలన, రైతులు, పేదలకు అమలుచేస్తున్న సంక్షేమకార్యక్రమాలకు ఆకర్షితు లై కాంగ్రెస్‌, బీజేపీ నేతలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని మంత్రి వేముల వ్యాఖ్యానించారు. 


logo