శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Sep 06, 2020 , 18:18:41

బలీయమైన శక్తిగా టీఆర్ఎస్ : ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

బలీయమైన శక్తిగా టీఆర్ఎస్ : ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

చేర్యాల : రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ బలీయమైన శక్తిగా ఎదిగిందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. చేర్యాల మండలం చుంచనకోట గ్రామానికి చెందిన యూత్‌ కాంగ్రెస్‌ మండల మాజీ ఉపాధ్యక్షుడు బూడిద అశోక్‌తో పాటు వార్డు సభ్యులు కుంట సత్యనారాయణ, సూర్ణ ఓజమ్మ, నాయకుడు బాలయ్య టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు అనంతుల మల్లేశం, వైస్‌ ఎంపీపీ తాండ్ర నవీన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

జనగామలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను కార్యకర్తలు ప్రజలకు వివరించాలన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూసే ఇతర పార్టీల నాయకులు టీఆర్ఎస్ లో చేరుతున్నారన్నారు. logo