సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 17, 2020 , 01:46:32

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌కు సీఎం కేసీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ప్రగతిభవన్‌లో సీఎంను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ఫోన్‌ద్వారా శుభాకాంక్షలు చెప్పారు. అసెంబ్లీలో మంత్రి కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. పలువురు ఎమ్మెల్యేల సమక్షంలో అసెంబ్లీలో కేక్‌ కట్‌చేశారు.


ఉద్యోగ సంఘాల శుభాకాంక్షలు  

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు ఉద్యోగసంఘాలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపాయి. టీజీవో శ్రీనివాస్‌గౌడ్‌పై  వెలువరించిన ‘ఉద్యోగుల కిరణం’ పత్రికను మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీజీవో అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ పాల్గొన్నారు. టీఎన్జీవో కేంద్ర సంఘం  అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మామిళ్ల రాజేందర్‌, తెలంగాణ గ్రూప్‌-1 అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి హనుమంత్‌నాయక్‌, తెలంగాణ పర్యాటకశాఖ కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సంఘం నేత రాజమౌళి జన్మదిన వేడుకలు జరిపారు. బీటీఎన్జీవో అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణ, కార్యదర్శి మల్లారెడ్డి, శ్రీనివాస్‌, రాజేశ్వర్‌రావు, ప్రభాకర్‌రెడ్డి, టీజీవో వైద్యారోగ్యశాఖ విభాగం అధ్యక్షుడు జూపల్లి రాజేందర్‌ జన్మదిన వేడుకలు నిర్వహించారు. logo