శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 14, 2020 , 13:33:15

చిరంజీవి సినిమా నుంచి తప్పుకున్న త్రిష

చిరంజీవి సినిమా నుంచి తప్పుకున్న త్రిష

సృజనాత్మక విభేదాల వల్ల తాను చిరంజీవి సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు త్రిష శుక్రవారం ట్విట్టర్‌ ద్వారా ప్రకటించిన విష‌యం తెలిసిందే. చిరంజీవి వంటి అగ్ర కథానాయకుడి సినిమా నుంచి త్రిష ఒక్కసారిగా తప్పుకోవడం ఈ వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం త్రిష స్థానంలో స్టార్ హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్‌ని క‌థానాయిక‌గా ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తుంది. ఇప్ప‌టికే ఆమెతో చ‌ర్చ‌లు కూడా  జ‌రిపిన‌ట్టు  స‌మాచారం. అతి త్వ‌ర‌లో దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంది. కాజ‌ల్ గ‌తంలో ఖైదీ నెం 150 చిత్రంలో చిరుతో రొమాన్స్ చేసిన విష‌యం తెలిసిందే. 

కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘ఆచార్య’ అనే పేరును ఖరారు చేశారు.  రామ్‌చరణ్‌, నిరంజన్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. మరోవైపు త్రిష మహిళా ప్రధాన చిత్రాలతో తమిళంలో బిజీగా ఉంది. ‘లయన్‌' (2015) తర్వాత తెలుగులో స్ట్రెయిట్‌ సినిమాలో నటించలేదు త్రిష. పలు అనువాద సినిమాల ద్వారా మాత్రమే ఇక్కడి ప్రేక్షకుల్ని పలకరించింది. 


logo