గురువారం 09 జూలై 2020
Telangana - Jun 26, 2020 , 13:19:53

గిరిజన సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి పువ్వాడ

గిరిజన సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి పువ్వాడ

భద్రాద్రి కొత్తగూడెం : మారుమూల ప్రాంతం లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వడం సంతోషంగా ఉందని వాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. జిల్లాలోని చర్ల గ్రామం లక్ష్మీ కాలనీలో రూ. 3.77 కోట్లతో నూతనంగా నిర్మించిన 65 డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారని ఆయన తెలిపారు. చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో ఏ అభివృద్ధి పని కావాలన్నా చేస్తామన్నారురాజకీయాలు కాదు, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమని హితవు పలికారు. 

పోడు భూములు విషయంలో ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో ఉన్నారు. ప్రతి జిల్లాకు సీఎం కేసీఆర్ స్వయంగా వచ్చి పోడు భూముల ఆదివాసీలకు పట్టాలు ఇస్తానని చెప్పారు. ఆ రోజు కోసం అందరం ఎదురు చూద్దామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ మలోతు కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యే పొదెం వీరయ్య, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. 


logo