ఆదివారం 24 జనవరి 2021
Telangana - Jan 12, 2021 , 20:28:23

ఎక్సైజ్‌ అధికారులపై గిరిజనుల తిరుగుబాటు

ఎక్సైజ్‌ అధికారులపై గిరిజనుల తిరుగుబాటు

నాగర్‌కర్నూల్‌ : నాటుసారా తయారీ జోరుగా కొసాగుతుందన్న సమాచారం మేరకు ఎక్సైజ్‌ అధికారులు దాడులు చేయగా గిరిజనులు తిరుగుబాటు చేసిన సంఘటన జిల్లాలోని కోడేరు మండలం నార్యానాయక్‌ తండాలో చోటు చేసుకున్నది. ఎక్సైజ్‌ పోలీసుల కథనం మేరకు..నాగులపల్లితండా, నార్యానాయక్‌తండాలో నాటుసారా తయారీతోపాటు నల్ల బెల్లం విక్రయాలు కొనసాగుతున్నాయన్న సమాచారం మేరకు మంగళవారం ఉదయం ఉమ్మడి జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఎక్సైజ్‌ సీఐ రమణయ్య, నాగర్‌కర్నూల్‌ డీటీఎఫ్‌ సీఐ పరమేశ్‌గౌడ్‌  కొల్లాపూర్‌ ఎక్సైజ్‌ అధికారులు ఇబ్రహీంరాజా, శంకర్‌ తమ సిబ్బందితో మూకుమ్మడిగా దాడులు చేశారు.

నాగులపల్లి తండాలో సోదాలు చేసిన అనంతరం నార్యానాయక్‌తండాకు వెళ్లి సోదాలు నిర్వహిస్తుండగా అదే తండాకు చెందిన భాస్కర్‌నాయక్‌, మరికొందరు కలిసి తిరుగుబాటు చేశారు. ఈక్రమంలో ఇరువురి మధ్య మాటామటా పెరిగింది. ఎక్సైజ్‌ హెడ్‌కానిస్టేబుల్‌ శంకర్‌నాయక్‌ కలుగచేసుకొని సర్ది చెబుతుండగా కొందరు కలిసి రాళ్లతో దాడి చేశారు. ఈదాడుల్లో శంకర్‌నాయక్‌ తలకు గాయమైంది. వెంటనే అతన్ని కొల్లాపూర్‌ దవాఖానకు తరలించి చికిత్స చేయించారు. దాడికి పాల్పడిన వ్యక్తులను అదుపులోకి తీసుకొని కొల్లాపూర్‌ ఎక్సైజ్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు హెడ్‌కానిస్టేబుల్‌ మద్దిలేటి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  

ఇవి కూడా చదవండి..

రంగుల హరివిల్లుగా మారిన ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌

ఎమ్మెల్సీ కవితను కలిసిన ఒగ్గు కళాకారులు

మినీ డెయిరీ పథకాన్ని విజయవంతం చేద్దాం 

సాగు చ‌ట్టాలపై సుప్రీం స్టే.. చ‌ర్చ‌ల కోసం క‌మిటీ logo