శనివారం 27 ఫిబ్రవరి 2021
Telangana - Jan 17, 2021 , 01:59:23

మెరిసిన గిరిజన విద్యార్థి

మెరిసిన గిరిజన విద్యార్థి

  • పాలమూరు వర్సిటీ బీఏ సోషల్‌ సైన్సెస్‌లో ప్రథమ స్థానం

హైదరాబాద్‌, జనవరి 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల(టీటీడబ్ల్యూడీసీ) విద్యార్థి నాగర్‌కర్నూల్‌కు చెందిన ఆరుట్ల కృష్ణ పాలమూరు యూనివర్సిటీలో ప్రతిభచాటాడు. బీఏ సోషల్‌ సైన్సెస్‌లో ప్రథమస్థానంలో నిలిచి గురుకులాల సత్తా చాటాడని గురుకుల విద్యాలయాల సంస్థ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పేర్కొన్నారు. కృష్ణ సీజీపీఏలో 9.85 పాయింట్లతో యూనివర్సిటీలో ప్రథమస్థానంలో నిలిచినందుకు గర్వంగా ఉన్నదని చెప్పారు. ప్రభుత్వం కల్పించిన అవకాశం, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌తోపాటు అధ్యాపకుల ప్రోత్సాహం వల్లే తాను ఈ స్థానం సాధించానని.. సివిల్స్‌ సర్వీసెస్‌ సాధించడమే తన లక్ష్యమని కృష్ణ చెప్పాడు.


VIDEOS

logo