శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Oct 05, 2020 , 08:03:42

సాంకే‌తి‌క‌త‌వైపు గిరి‌జన యువత

సాంకే‌తి‌క‌త‌వైపు గిరి‌జన యువత

హైద‌రా‌బాద్‌: రాష్ట్రం‌లోని గిరి‌జన యువ‌తను సాంకే‌తి‌కత వైపు మళ్లిం‌చేం‌దుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిం‌చింది. తండాల్లో ఒక‌వైపు విద్యా‌రం‌గా‌నికి ప్రాధాన్యం ఇస్తూనే.. చదు‌వు‌కు‌న్న‌వా‌రికి డిజి‌టల్‌ శిక్షణ అందించి వారు పరి‌శ్ర‌మలు స్థాపించి ఆర్థి‌కా‌భి‌వృద్ధి సాధిం‌చ‌డం‌తో‌పాటు కొంత‌మం‌దికి ఉపాధి కల్పిం‌చేలా తీర్చి‌ది‌ద్దేం‌దుకు ప్రత్యేక కార్యా‌చ‌రణ చేప‌ట్టింది. ఇందులో భాగంగా గిరి‌జన సంక్షే‌మ‌శాఖ ఆధ్వ‌ర్యంలో ట్రైబల్‌ డిజి‌టల్‌ లీడ‌ర్‌‌షిప్‌ (టీ‌డీ‌ఎల్‌) కార్య‌క్ర‌మాన్ని చేప‌డు‌తు‌న్నారు. టీడీ‌ఎల్‌ ద్వారా డిజి‌టల్‌ టెక్నా‌ల‌జీని పెంచ‌డం‌తో‌పాటు గిరి‌జన యువ‌తను శక్తి‌వం‌తం‌చే‌యడం, విద్య, ఆరోగ్యం, డిజి‌టల్‌ అక్ష‌రా‌స్యత, వ్యవ‌స్థా‌ప‌కత, జీవన నైపు‌ణ్యా‌లపై తండాలు, ఆవాస ప్రాంతా‌ల్లో‌ని‌ వా‌రికి అవ‌గా‌హన కల్పిం‌చేం‌దుకు, స్వయం గా పరి‌శ్ర‌మలు స్థాపిం‌చా‌ల‌ను‌కు‌న్న‌వా‌రికి ఆన్‌‌లై‌న్‌లో శిక్షణ ఇస్తారు. 

కేంద్ర ప్ర‌భుత్వం గోయింగ్‌ ఆన్‌‌లైన్‌ యాజ్‌ లీడర్‌(గోల్‌) పేరుతో డిజి‌టల్‌ శిక్షణ ఇస్తు‌న్న‌ప్ప‌టికీ.. ఇందులో మన రాష్ట్ర గిరి‌జన యువ‌తకు ఈ విడుత 60 మందికే అవ‌కాశం దక్కింది. దీంతో ఎక్కు‌వ‌మంది డిజి‌టల్‌ లీడ‌ర్లను సిద్ధం‌చే‌సేం‌దుకు రాష్ట్ర ప్రభుత్వం తర‌ఫున శిక్షణ ఇవ్వా‌లని నిర్ణ‌యిం‌చారు. ఈ మేరకు నిర్మాణ్‌ సంస్థ ఆధ్వ‌ర్యంలో టీడీ‌ఎల్‌ కార్య‌క్ర‌మాన్ని గిరి‌జన సంక్షే‌మ‌శాఖ చేప‌ట్టింది. 

మొదటి విడుత గిరి‌జన ప్రాంతా‌ల్లోని విద్యా‌వం‌తు‌లైన మహి‌ళ‌లకు శిక్షణ ఇచ్చి, వారు పరి‌శ్ర‌మలు స్థాపిం‌చు‌కు‌నేం‌దుకు ప్రోత్స‌హి‌స్తారు. వారి ద్వారా గ్రామ‌స్థాయి డిజి‌టల్‌ యువ నాయ‌కు‌లుగా ఎద‌గ‌డా‌నికి ఎస్టీ యువ‌తకు ప్రత్యేక అవ‌కాశం కల్పి‌స్తు‌న్నారు. టీడీ‌ఎ‌ల్‌ ను 15 రోజుల్లో ప్రారం‌భిం‌చ‌ను‌న్నట్టు గిరి‌జన సంక్షే‌మ‌శాఖ అధి‌కా‌రులు తెలి‌పారు. విద్యా‌వం‌తు‌లైన గిరి‌జన మహి‌ళ‌లకు 6 నెల‌ల‌పాటు అందించే ఈ శిక్ష‌ణకు 60 మందిని ఎంపి‌క‌చే‌శారు. వారికి అవ‌స‌ర‌మైన కోర్సు కిట్‌, ఇతర ఆర్థి‌క‌సా‌యాన్ని అందిం‌చేం‌దుకు హెచ్‌‌వై‌ఎ‌స్‌‌ఈఏ ముందు‌కొ‌చ్చింది.


logo