e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home టాప్ స్టోరీస్ కాపాడే రాజులా కింగ్‌ కోఠి దవాఖాన

కాపాడే రాజులా కింగ్‌ కోఠి దవాఖాన

కంటిరెప్పలా కరోనా రోగులకు చికిత్స

కాపాడే రాజులా కింగ్‌ కోఠి దవాఖాన

హైదరాబాద్‌, మే 3 (నమస్తే తెలంగాణ): కింగ్‌కోఠి దవాఖాన కరోనా బాధితులకు ఖరీదైన వైద్యం అందిస్తూ ఎంతోమందిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతున్నది. వైరస్‌బారిన పడ్డ ఓ మహిళ ఈ దవాఖానలో చేరి కోలుకున్నారు. హైదరాబాద్‌లోని బోరబండ గాయత్రినగర్‌లో ఉండే సయ్యద్‌ రిజ్వానా ఇటీవల కరోనాబారిన పడ్డారు. తీవ్ర ఆయా సం, శ్వాస సమస్య తలెత్తడంతో కింగ్‌కోఠి దవాఖానలో చేరా రు. ‘కింగ్‌కోఠి దవాఖానలో నా వార్డులో 20 మంది కొవిడ్‌ పేషెంట్లు ఉన్నారు. బెడ్లు ఖాళీ కాగానే పేషెంట్లు వచ్చి చేరుతున్నారు. డాక్టర్లు, నర్సులు మంచి చికిత్సను అందించారు. టిఫిన్‌, విటమిన్లు లభించే పండ్లు, డ్రైఫూ ట్స్‌, కోడిగుడ్లు, మజ్జిగ, చపాతి ఇచ్చారు. సకాలంలో మం దులు, ఇంజక్షన్లు ఇవ్వడంతో త్వరగా కోలుకోగలిగా. పల్స్‌ బాగాపడిపోతేనే రెమిడిసివిర్‌ ఇంజక్షన్లు ఇస్తున్నారు. కానీ నాకు ఆ అవసరం రాలే దు. బయట అధిక ధరలకు అమ్ముతున్న ఇంజక్షన్లు ఉచితంగానే ఇస్తున్నారని తెలిసి సర్కారు దవాఖానల్లో ఇంత మంచి వైద్యం దొరుకుతుందా అని ఆశ్చర్యపోయా. ప్రైవేట్‌ దవాఖానకు వెళ్తే రూ.లక్షలు ఖర్చయ్యేవి. ఇక్కడి డాక్టర్ల చొరవతో నాలుగురోజుల్లోనే కోలుకున్నా’ అని రిజ్వానా పేర్కొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కాపాడే రాజులా కింగ్‌ కోఠి దవాఖాన

ట్రెండింగ్‌

Advertisement