గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 04, 2020 , 14:07:32

తీవ్రత ఎక్కువ ఉన్నవారికే గాంధీలో చికిత్స

తీవ్రత ఎక్కువ ఉన్నవారికే గాంధీలో చికిత్స

హైదరాబాద్‌: దేశంలో ఢిల్లీ తర్వాత రాష్ట్రంలోనే అత్యధికంగా హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారని తెలంగాణ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ డా. జీ శ్రీనివాసరావు ప్రకటించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఆరు వేల మందికిపైగా హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారని వెల్లడించారు. ఇప్పటివరకు 12 వేల మందికి పైగా హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారని చెప్పారు. తీవ్రత ఎక్కువ ఉన్నవారికి గాంధీ దవాఖానలో చికిత్స అందిస్తున్నామన్నారు. 

కరోనా బాధితుల కోసం నాలుగు దవాఖానల్లో 2501 పడకలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. నేచర్‌ క్యూర్‌, ఆయుర్వేద ఆస్పత్రుల్లోనూ బాధితులకు చికిత్స అందిస్తున్నామన్నారు. వెయ్యి మందికిపైగా ప్రైవేటు దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. అవసరమైన వారికి టెలిమెడిసిన్‌ సేవలు, వీడియో కాల్‌ ద్వారా కూడా వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం మార్చి నెలలోనే ముందు జాగ్రత్తలు చేపట్టిందని, ల్యాబ్‌లు, దవాఖానలు ముందుగానే సిద్ధం చేసిందని తెలిపారు. 


logo