గురువారం 28 మే 2020
Telangana - May 16, 2020 , 19:33:15

ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారమే చికిత్స : ఈటల రాజేందర్‌

ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారమే చికిత్స : ఈటల రాజేందర్‌

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిస్థాయిలో అదుపులో ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. హైదరాబాద్ లో యాక్టివ్ కేసులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న నోడల్ అధికారులు, డాక్టర్లతో మంత్రి స్వయంగా మాట్లాడారు. ఒకే కుటుంబంలో ఎక్కువ మందికి వైరస్ సోకడం వల్లనే రాష్ట్రంలో ఎక్కువ కేసులు నమోదుఅవుతున్నాయన్నారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారమే వీరందరికీ చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. తాజాగా పలు కీలక మార్పులతో ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ విడుదల చేసిందని వాటి ప్రకారం డిశ్చార్జ్ పాలసీ, హోమ్ ఐసోలేషన్, డెత్ గైడ్ లైన్స్ ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుందని ప్రకటించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ నూతన మార్గనిర్దేశకాల ప్రకారం కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తులను పది రోజుల పాటు చికిత్స అందించిన తరువాత ఎటువంటి పరీక్షలు చేయకుండానే డిశ్చార్జ్ చేయవచ్చని పేర్కొంది. ఇలా డిశ్చార్జ్ అయిన వారిని మరో ఏడు రోజుల పాటు హోమ్ ఐసోలేషన్ లో ఉంచాలని తెలిపింది. ఒక వేల లక్షణాలు ఎక్కువ ఉన్న, ఇతర ధీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాదపడుతున్న పేషంట్లను మాత్రం హాస్పిటల్ లో ఉంచి చికిత్స అందిచాలని నిర్దేశించినట్లు తెలిపారు.


logo