సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 11, 2020 , 06:48:31

ట్రావెల్‌ హిస్టరీ దాయడం నేరం

ట్రావెల్‌ హిస్టరీ దాయడం నేరం

తిరువనంతపురం : పబ్లిక్‌ హెల్త్‌ యాక్ట్‌ ప్రకారం కరోనా వ్యాధి వ్యాప్తికి పాల్పడేవిధంగా ఎవరైనా ప్రవర్తిస్తే నేరంగా పరిగణిస్తామని కేరళ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి పేర్కొన్నారు. కరోనా ప్రభావిత ప్రాంతాలు, దేశాల నుంచి భారత్‌కు తిరిగివచ్చినవారు వారి ప్రయాణ సమాచారాన్ని తెలియజేయాలన్నారు. ట్రావెల్‌ హిస్టరీని దాస్తే నేరంగా పరిగణించి చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కరోనా వైరస్ బాధితులు దేశవ్యాప్తంగా 61 కి చేరుకున్నారు. నిన్న ఒక్కరోజే 14 కొత్త కేసులు నమోదయ్యాయి. కేరళలో కరోనా బాధితుల సంఖ్య 14కి చేరింది. కర్ణాటక, మహారాష్ర్టలో 3 చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ దృష్ట్యా ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ దేశస్థుల రాకపై కేంద్రం ఆంక్షలు విధించారు. రెగ్యులర్, ఈ-వీసాలను సైతం రద్దు చేసింది. చైనా, ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియా, జపాన్ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించింది.  యూరోపియన్‌ యూనియన్‌ దేశాలన్నింటికి కరోనా వైరస్‌ విస్తరించింది. కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తుండటంతో ఇటలీలో జనసంచారంపై ఆంక్షలు విధించారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే జైలు శిక్ష శిక్ష వేస్తామంటూ ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది.


logo