మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Aug 05, 2020 , 04:15:13

మహిళలకు అండగా సీఎం కేసీఆర్‌

మహిళలకు అండగా సీఎం కేసీఆర్‌

  • రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ 

ఖమ్మం: ప్రతి పేదింటి ఆడపిల్లకు సీఎం కేసీఆర్‌ భరోసాగా నిలిచారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. శిశువు నుంచి పండు ముసలి వరకు అన్ని స్థాయిల్లో మహిళకు అండగా ఉన్న ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఒక్క కేసీఆర్‌ మాత్రమేనన్నారు. మంగళవారం ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలోని మంజూరైన 2,46,80,000 విలువైన కల్యాణలక్ష్మి చెక్కులను మంత్రి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలోనూ రాష్ట్రంలో ఏ ఒక్క సంక్షేమ పథకం ఆగలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 44 లక్షల మందికి ప్రతినెలా ఆసరా పింఛన్లు అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు లావుడ్యా రాములునాయక్‌, సండ్ర వెంకటవీరయ్య, జెడ్పీ చైర్మన్‌ లింగాల కమలరాజు, మేయర్‌ పాపాలాల్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo