ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 03, 2020 , 14:30:02

ధరణి పోర్టల్‌ ద్వారా పారదర్శకంగా రిజిస్ట్రేషన్లు

ధరణి పోర్టల్‌ ద్వారా  పారదర్శకంగా రిజిస్ట్రేషన్లు

ఖమ్మం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా ప్రారంభమయ్యాయన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  అన్నారు. జిల్లాలోని రఘునాధపాలెం తహసిల్దార్  కార్యాలయంలో ధరణి సేవల ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతుతో మాట్లాడారు. ఆయా పత్రాలను  వారికి అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ..ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్లకు మంచి స్పందన లభిస్తోందన్నారు.

రిజిస్ట్రేషన్ల స్లాట్ బుకింగ్‌ను మీ సేవా కేంద్రాల ద్వారా కేవలం రూ. 200 చెల్లించి చేసుకోవచ్చని, స్మార్ట్ ఫోన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చని తెలిపారు. పాత రిజిస్ట్రేషన్లు, పాత మ్యుటేషన్లు, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల పై త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్ మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి అధికారులు ఉన్నారు.