గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 28, 2020 , 23:13:34

అందర్నీ కలిపేది అనువాదమే

అందర్నీ కలిపేది అనువాదమే

పీవీ బహుభాషా కోవిదుడు.. ఈ మాట ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. తెలుగువాడైనా మాతృభాషతో పాటు అనేక భారతీయ భాషలకు పట్టం కట్టారాయన. విశ్వనాథ రాసిన వేయిపడగలు నవలను సహస్రఫణ్‌ పేరుతో హిందీలోకి అనువదించారు. ఓ సాహిత్య సభలో మాట్లాడిన పీవీ.. ఒక భాష నుంచి మరో భాషలోకి అనువాదం వల్ల ఆయా సంస్కృతులు ఇతరులకు తెలుస్తాయని అన్నారు. ఒకరి భాష పట్ల మరొకరికి అభిమానం ఏర్పడుతుందని, దీనివల్ల భిన్నత్వంలో ఏకత్వం సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. సమకాలీన పరిస్థితుల దృష్ట్యా అనువాదం చాలా అవసరమని ఆయన అనేవారు.logo