మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Sep 12, 2020 , 03:46:27

సీఈఏ ప్రమాణాలు పాటించాలి

సీఈఏ ప్రమాణాలు పాటించాలి

  • ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు

హైదరాబాద్‌, నమస్తే తెలంగా ణ: విద్యుత్‌ గ్రిడ్‌ నిర్వహణ, భద్రతలతోపాటు విద్యు త్‌ ప్రాజెక్టుల నిర్మాణంలోనూ సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) నిర్దేశించిన ప్రమాణాలను, నిబంధనలను పాటించాలని ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ఆదేశించారు. సమయానుకూలంగా సీఈఏ నిర్దేశిస్తున్న ప్రమాణాలను గ్రిడ్‌ నిర్వహణ, విద్యుత్‌ సరఫరాలో భద్ర తా ప్రమాణాలు, మీటర్ల ఏర్పాటు, నిర్వహణలో, విద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణం, గ్రిడ్‌ల అనుసంధానంలో కచ్చితంగా ఉండాలని శుక్రవారం ఉత్తర్వులో పేర్కొన్నారు. పాటించాల్సిన ప్రమాణాలను వేర్వేరుగా సీఈఏ నిర్దేశించినట్టు వెల్లడించారు. 


logo