శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 12, 2020 , 06:20:22

నిరుద్యోగ యువకులకు శిక్షణ..దరఖాస్తుల ఆహ్వానం

నిరుద్యోగ యువకులకు శిక్షణ..దరఖాస్తుల ఆహ్వానం

రాజేంద్రనగర్ :  రాజేంద్రనగర్‌లోని బ్యాంకర్ల గ్రామీణ, ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ (బైరెడ్‌)లో నిరుద్యోగ యువకులకు 40రోజుల పాటు వృత్తి విద్యా కోర్సులపై ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఏప్రిల్‌ 3 నుంచి మే 12వ తేదీ వరకు వివిధ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇవ్వబడుతుందని నిర్వాహకులు తెలిపారు. మొబైల్‌ సర్వీసింగ్‌, ఎలక్ట్రీషియన్‌, పంప్‌సెట్‌ రిపేర్‌లో శిక్షణ పొందేందుకు కనీస విద్యార్హత పదో తరగతి పాసై ఉండాలన్నారు. అకౌంటింగ్‌ ప్యాకేజి, జీఎస్‌టీలో శిక్షణకు బీకాం(ట్యాలీ, జీఎస్‌టీ) పాసై ఉండాలని తెలిపారు. శిక్షణ కాలంలో వసతితో పాటు భోజనం ఉచితంగా అందజేస్తామన్నారు. అభ్యర్థుల రవాణా ఖర్ఛులు కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల యువకులు www.bired.orgలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులు అందిన వెంటనే ఫోన్‌ ద్వారా వారి అర్హతలను బట్టి తగిన ప్రవేశ సూచనలు ఇవ్వబడతాయన్నారు. ఈనెల 12వ తేదీ నుంచి 22వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. 


logo