శనివారం 23 జనవరి 2021
Telangana - Dec 27, 2020 , 00:44:04

శ్రీగంధం, ఎర్రచందనం పెంపకంపై శిక్షణ

శ్రీగంధం, ఎర్రచందనం పెంపకంపై శిక్షణ

మేడ్చల్‌, నమస్తే తెలంగాణ: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ డైవర్సిటీ ఆధ్వర్యంలో శ్రీగంధం, ఎర్ర చందనం మొక్కల పెంపకంపై రైతులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్టు మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఉద్యానశాఖ అధికారి సత్తార్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దుండిగల్‌ ఫారెస్ట్‌ అకాడమీలో ఈ నెల 28 నుంచి 31 వరకు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. శిక్షణకాలంలో రైతులకు వసతితోపాటు ప్రయాణభత్యాలు ఇస్తామని వెల్లడించారు. శ్రీగంధం, ఎర్రచందనం మొక్కల పెంపకం, మార్కెట్‌ అవగాహన, ప్రభుత్వ అనుమతులు, ఔషధ మొక్కలు, వ్యవసాయేతర అటవీ ఉత్పత్తులు, సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించనున్నట్టు తెలిపారు. ముందుగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్న 40 మంది రైతులకు మాత్రమే అవకాశం ఉంటుందని, వివరాలకు 040-66309500 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.logo