మంగళవారం 19 జనవరి 2021
Telangana - Jan 08, 2021 , 15:41:33

ఉద్యోగ నియామకాల కోసం గిరిజన యువతకు శిక్షణ

ఉద్యోగ నియామకాల కోసం గిరిజన యువతకు శిక్షణ

హైదరాబాద్‌ : గిరిజన నిరుద్యోగ యువతను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చేందుకు గిరిజన సంక్షేమ శాఖ ఒక ప్రణాళికను సంసిద్ధం చేసింది. అవకాశం కల్పిస్తే గిరిజన యువత ఎవరికి తీసిపోరని ఇప్పటికే అనేకసార్లు రుజువైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మరోసారి తెలంగాణ ప్రభుత్వం చేపట్టే ఉద్యోగ నియామకాల్లో ఓపెన్ కేటగిరిలో పోటీ పడే విధంగా గిరిజన నిరుద్యోగ యువతకు రెసిడెన్షియల్ విధానంలో శిక్షణ ఇవ్వాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ నిర్ణయించారు. 

ఈ మేరకు గిరిజన శాఖ రాష్ట్రంలోని గిరిజన నిర్యుద్యోగ యువతీ యువకులకు పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్‌స్పెక్టర్, ఉపాధ్యాయ , గ్రూప్ -1, గ్రూప్-2, గ్రూప్-4 తదితర నియామకాలకి  సంసిద్ధం అయ్యేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 26 కేంద్రాల్లో 3,550 మందికి గాను కోచింగ్ ఏర్పాట్లు చేస్తున్నది. 3,550 యువతీ యువకులకు రెసిడెన్షియల్ ప్రాతిపదికన 60 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు.

ఐటీడీఏలు ఉట్నూర్, ఏటూరునాగారం, భద్రాచలం పరిధిలో ఒక్కో ఐటీడీఏ లో పోలీస్ విభాగంలో బాలురు 150, బాలికలు 150 మందికి గాను డీఎస్సీ బాలురు 150, బాలికలు 150, గ్రూప్స్ తదితరాల కోసం బాలురు 150, బాలికలు 150 మందికి మరియు ఐటీడీఏ మన్ననూర్ పరిధిలో పోలీస్ 100, డీఎస్సీ 100, గ్రూప్స్ 100, మిగిలిన మైదాన ప్రాంత గిరిజన అభ్యర్థులకు హైదరాబాద్ లో పోలీస్ 150,  DSC  బాలురు 100, బాలికలు 100 మరియు గ్రూప్స్ తదితర బాలురు 100 బాలికలు చొప్పున మొత్తం 3,550 మంది ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ఉంటుంది. వీటికోసం గిరిజన సంక్షేమ శాఖ త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

అర్హత పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ, భోజన వసతి నివాసం, నోటుబుక్స్ , పాకెట్ మనీ, రిఫరెల్ బుక్స్ , పోలీస్ అభ్యర్థులకు ట్రాక్ సూట్, షూ లాంటి సౌకర్యాలు కల్పిస్తారు. ఫిబ్రవరి రెండో వారం నుంచి 60 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసుకోబడిన కేంద్రాల్లో శిక్షణ ఉంటుంది. కావున రాష్ట్రంలోని అర్హత కలిగిన గిరిజన నిరుద్యోగ యువతీ యువకులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు.

ఇవి కూడా చ‌ద‌వండి

సిడ్నీ టెస్ట్‌లో రోహిత్ శ‌ర్మ అరుదైన రికార్డు

రోహిత్‌, గిల్‌ల‌ను రెచ్చ‌గొట్టిన ల‌బుషేన్‌‌.. వీడియో

క్యాపిట‌ల్ హిల్ అటాక్‌.. సూప‌ర్ స్ప్రెడింగ్ ఈవెంట్ !

త‌న‌కు తాను క్ష‌మాభిక్ష .. ట్రంప్ మ‌రో సంచ‌ల‌నం!

ప్రెగ్నెన్సీ కోసం ల‌‌ఢాక్‌కు యురోపియ‌న్ అమ్మాయిలు.. ఎందుకు?

హెచ్‌-1బీ వీసా: లాట‌రీ ప‌ద్ధ‌తికి గుడ్‌బై