గురువారం 04 జూన్ 2020
Telangana - Feb 20, 2020 , 22:08:33

గిరిజన లా గ్రాడ్యుయేట్లకు శిక్షణ..

గిరిజన లా గ్రాడ్యుయేట్లకు శిక్షణ..

హైదరాబాద్  : జిల్లాలలో గల గిరిజన లా గ్రాడ్యుయేట్లకు అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫ్‌ జస్టీస్‌లో శిక్షణనివ్వనున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమాధికారి  ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకంలో ఎంపికైన 5 మంది గిరిజన గ్రాడ్యుయేట్లకు 3 సంవత్సరాల పాటు వేతనం చెల్లించబడుతుందని, శిక్షణకాలంలో ప్రతినెల వేతనం కింద రూ. 1000, మొదటి సంవత్సరం పుస్తకాలు, ఆఫీస్‌ ఫర్నీచర్‌ కొనుగోలుకు రూ. 6వేలు చెల్లిస్తామన్నారు. జిల్లాలలో ఆసక్తి గల గిరిజన లా గ్రాడ్యుయేట్లు నాంపల్లి గృహకల్ప కాంప్లెక్స్‌లోని జిల్లా గిరిజన అభివృద్ది అధికారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. లా గ్రాడ్యుయేట్‌ ధృవపత్రం, బార్‌ కౌన్సిల్‌ ఎన్‌రోల్‌మెంట్‌, కులం, ఆదాయం, ఆధార్‌కార్డు, ఎస్సెస్సీ సర్టిఫికెట్లను జతపరచాలని సూచించారు.logo