మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 04, 2020 , 07:45:52

ఎస్సీ నిరుద్యోగ యువతకు పలు కోర్సుల్లో శిక్షణ

ఎస్సీ నిరుద్యోగ యువతకు పలు కోర్సుల్లో శిక్షణ

హైదరాబాద్ : జిల్లాలోని ఎస్సీ నిరుద్యోగ యువతకు  పలు కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా ఎస్సీశాఖ అధికారులు తెలిపారు. సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌ శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ట్యాబ్లెట్స్‌ మొబైల్‌ ఫోన్‌, స్మార్ట్‌ఫోన్‌(మూడు నెలల కాలపరిమితి), ఎల్‌ఈడీ, ఎల్‌సీడీ, ప్లాస్మా టీవీ, హోమ్‌ థియేటర్‌, ఎయిర్‌కండీషనర్‌, మాస్టర్‌ సర్టిఫికెట్‌ కోర్సు, సీఏవో కోర్సుల్లో శిక్షణ పొందగోరే అభ్యర్థులు దరఖాస్తులు అందజేయాలన్నారు. అభ్యర్థుల వయసు 18 నుంచి 35 సంవత్సరాలలోపు ఉండాలని, దరఖాస్తుతోపాటు కులం, ఆదాయం, స్టడి సర్టిఫికెట్‌ జిరాక్స్‌లు జతచేసి ఎస్సీ కార్యాలయంలో(కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ హైదరాబాద్‌) ఈ నెల 13వ తేదీలోగా దరఖాస్తు సమర్పించాలన్నారు. 


logo
>>>>>>