మంగళవారం 26 జనవరి 2021
Telangana - Nov 25, 2020 , 16:18:28

కోమటిబండను సందర్శించిన ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు

కోమటిబండను సందర్శించిన ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు

సిద్దిపేట : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మిషన్‌ భగీరథ పథకం అమలు తీరును గుజరాత్‌కు చెందిన 50 మంది ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ల బృందం బుధవారం గజ్వేల్‌ మండలంలోని కోమటిబండ గుట్టను సందర్శించారు. మిషన్‌ భగీరథ అధికారుల ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒకే చోట నుంచి వందలాది గ్రామాలకు నీటి సరఫరా అవుతుండడం పట్ల అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. ఇంటింటికి తాగునీరు అందించడం బాగుందని ప్రశంసించారు. 


logo