28 నుంచి మణుగూర్-సికింద్రాబాద్ మధ్య రైలు కూత!

కొత్తగూడెం టౌన్: భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా కేంద్రం భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్ మధ్య దాదాపు 10 నెలల తర్వాత రైలు సర్వీసులు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నెల 28వ తేదీ నుంచి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసును ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) శుక్రవారం వెల్లడించింది. భారతీయ రైల్వే సిఫారసు మేరకు ఎస్సీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నది.
మణుగూరు నుండి సికింద్రాబాద్ వరకు నడిచే ఈ ప్రత్యేక రైలు (ట్రైన్ నెం. 02745) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 28వ తేదీ రాత్రి 11:45 గంటలకు బయలు దేరుతుంది. మణుగూరు నుండి ఇదే రైలు (ట్రైన్.నెం. 02746) 29వ తేదీ రాత్రి 10:25 గంటలకు సికింద్రాబాద్‌కు బయలుదేరనుంది.
ఈ రైలు మణుగూరులో ప్రారంభమై భద్రాచలం(కొత్తగూడెం) రోడ్, కారేపల్లి, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట, జనగామ స్టేషన్లలో మాత్రమే నిలుస్తుందని ఆ శాఖ నిర్ణయించినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ ప్యాసింజర్ ట్రాఫిక్ మేనేజర్ శుక్రవారం విడుదల చేసిన సర్క్యులర్ లో పేర్కొన్నారు.
కరోనా మహమ్మారిని నియంత్రించడానికి విధించిన లాక్డౌన్ వల్ల గతేడాది మార్చి నుంచి దేశవ్యాప్తంగా రైలు సర్వీసులు రద్దయ్యాయి. అందులో భాగంగా భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్ నుండి నడిచే ఆరు రైళ్లను రైల్వే శాఖ రద్దు చేయడంతో రైల్వే ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతం. ఎట్టకేలకు తిరిగి 10 నెలల తర్వాత మణుగూర్- సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు కూత పెట్టనుండడంతో ప్రయాణికులు కాస్త ఊపిరి పీల్చు కోనున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- మోదీ ర్యాలీలో గంగూలీ.. ఆయన ఇష్టమన్న బీజేపీ
- ఎములాడ రాజన్న.. మోదీ మనసు మార్చు
- చంద్రుడిని చుట్టొద్దాం.. దరఖాస్తు చేసుకోండి
- శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత
- తప్పుకున్న నీరా టండన్.. బైడెన్‌కు చుక్కెదురు
- దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
- అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది దుర్మరణం
- శంషాబాద్ విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం
- 9 నుంచి ఇంద్రకీలాద్రిపై మహాశివరాత్రి ఉత్సవాలు
- ఇన్నోవేషన్స్ సమాజంపై ప్రభావం చూపాలి : పీయూష్ గోయల్