మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 22, 2020 , 08:48:51

కొత్తగూడెం, మణుగూరు వెళ్లే రైళ్లు రద్దు

కొత్తగూడెం, మణుగూరు వెళ్లే రైళ్లు రద్దు

సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌ నుంచి కొత్తగూడెం, మణుగూరు వెళ్లే రైళ్లు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. కొత్తగూడెం నుంచి ఆదివారం బయల్దేరనున్న సింగరేణి ఫాస్ట్‌ప్యాసింజర్‌, కొల్హాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌, రాత్రి సికింద్రాబాద్‌కు వెళ్లే మణుగూరు సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, కాకతీయ ఫాస్ట్‌ ప్యాసింజర్‌తో పాటు రానున్న సింగరేణి ఫాస్ట్‌ప్యాసింజర్‌లను రైల్వేశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రద్దు చేశారు. ప్రయాణికులు గమనించాలని ఆ శాఖ స్థానిక సెక్షన్‌ రైల్వే కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌ రామానాయక్‌ ఒక ప్రకటనలో  విజ్ఞప్తి చేశారు. కాగా నేటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు మణుగూరు, సికింద్రాబాద్‌ సూపర్‌ఫాస్ట్‌ రైలును, మణుగూరు - కొల్హాపూర్‌ వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైలును నిలిపివేస్తున్నట్లు ఆ శాఖ ఇది వరకే సర్క్యూలర్‌లో తెలియజేసింది. 


logo
>>>>>>