మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Aug 13, 2020 , 12:46:00

నారాయణఖేడ్ లో విషాదం.. కరోనాతో తల్లీ, కొడుకు మృతి

నారాయణఖేడ్ లో విషాదం.. కరోనాతో తల్లీ, కొడుకు మృతి

సంగారెడ్డి:  జిల్లాలోని నారాయణ్‌ ఖేడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. కరోనా రక్కసికి తల్లీ, కొడుకు మృతి చెందారు. మండలంలోని చల్లగిద్ద తండాకు చెందిన ఓ కుటుంబం నారాయణఖేడ్ లో నివాసం ఉంటున్నారు. ఇంట్లో ఇద్దరు కొడుకులు, కోడళ్లతో పాటు ఇంటి పెద్ద మహిళకు మొత్తం ఐదుగురు ఈ మహమ్మారి బారిన పడ్డారు. నాలుగు రోజుల క్రితం వారికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు ఫలితాలు వచ్చాయి. కాగా వీరు  ఇంట్లోనే ఉండి వైద్యం పొందుతున్నారు. 

అప్పటి వరకు బాగానే ఉన్న తల్లి రాత్రి మృతి చెందింది. ఉదయం కొడుకు మృతి చెందాడు. దీంతో అదే ఇంట్లో ఉన్న వారు షాక్ కు గురయ్యారు. ఇదిలా ఉండగా మృత దేహాలను నారాయణఖేడ్ నుంచి ఇక్కడికి తరలించవద్దని చల్లగిద్ద తండా వాసులు సూచిస్తున్నారు. పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.logo